కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ దేశంలో మారణహోమం కొనసాగుతోంది. గత మూడు వారాలుగా జరిగిన ఘర్షణలు, కాల్పుల్లో దాదాపు 16500 మందికి పైగా చనిపోయినట్టు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ రెండో వారంలో మొదలైన నిరసనలు అంతర్యుద్ధానికి దారి తీశాయి. తీవ్రమైన ఆంక్షలు, అవినీతి, ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు కాస్త ప్రభుత్వ మార్పుకు పట్టుబడుతూ తీవ్ర రూపం దాల్చాయి. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకాయి. లక్షలాది మంది నిససన కారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వం అధికారులు, పోలీసులతో నిరసనకారులపై దాడులు చేయించింది. ఇప్పుడు అధికారులు నిరసన కారులపై కాల్పులు జరుపుతున్నారు.
ఈ కాల్పుల్లో వేలమంది మరణిస్తున్నారు. దాదాపు 3లక్షల 30వేల మందికి పైగా గాయపడ్డారు. ఇదే విషయాన్ని ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా తెలిపారు. ప్రతిరోజూ ఘర్షణల్లో వేలాది మంది చనిపోతున్నారని.. దీనంతటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణం అంటూ చెప్పారు. ట్రంప్ ఒక నయవంచకుడని.. ఆయన మాటలు నమ్మొద్దని కోరారు. అటు నిరసనకారులు కూడా ట్రంప్ ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. మొదట్లో ట్రంప్ నిరసన కారులను ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం హింసను అణచివేస్తోందంటూ మాట్లాడుతున్నారంటూ నిరసన కారులు మండిపడుతున్నారు. ఇలా ఇరాన్ (Iran) లో నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వ మార్పుకు నిరసన కారులు పట్టుబడుతున్నారు.


