కలం వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు జీవన్ రెడ్డి(Jeevan Reddy)కి లేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. జగిత్యాల(Jagtial) అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాంచారని తెలిపారు. తాను పార్టీ ఫిరాయించినట్లు కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఇంటి పార్టీ అన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డి గతంలో టీడీపీ జెండా మోసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, అతని తండ్రికి అంత అహంకారం పనికి రాదని హితవు పలికారు. పార్టీ జెండా మోయని వారికి కూడా భవిష్యత్తులో టికెట్ ఇస్తారని చెప్పారు. గతంలో ఎంతో మంది నేతలు పార్టీలు మారినా నోరెత్తని వాళ్లు తన గురించి విపరీతంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


