కలం వెబ్ డెస్క్ : మంచిర్యాల(Mancherial) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కొడుకును హత్య(Murder) చేసి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులే ఈ దారుణానికి కారణమైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా జన్నారం(Jannaram) మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన భూమయ్య గత కొన్ని రోజులుగా ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తన పదేళ్ల కుమారుడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక, అనారోగ్య సమస్యల కారణంగానే చనిపోతున్నట్లు ఓ సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు సమాచారం తెలుసుకొని రాంపూర్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


