epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రైవేట్ FDలు ఇవే..!

కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తే వడ్డీ వస్తుందని.. ఇవి చాలా సేఫ్ అనేది తెలిసిందే. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇచ్చే, సేఫ్టీ ప్రైవేట్ ఫిక్స్ డ్ డిపాజిట్లు (Private FDs )కూడా ఉంటాయి. కాకపోతే అందులో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. CRISIL, CARE, ICRE లాంటి ప్రముఖ ఏజెన్సీలు కార్పొరేట్ కంపెనీల ఫిక్స్ డ్ డిపాజిట్ల మీద క్రెడిట్ స్కోర్ ను ఇస్తూ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కంపెనీ క్రెడిట్ స్కోర్ ను నాలుగైదు ఏజెన్సీల్లో చెక్ చేయాలి. బాగుంటే అందులో ఫిక్స్ డ్ డిపాజట్ (Private FDs )చేసేయొచ్చు.

జనవరి 16 వరకు చూసుకుంటే ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లో మూడేళ్ల వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే 8.95 శాతం వడ్డీ వస్తోంది. ఇందులో ఒకవేళ సీనియర్ సిటిజన్లు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తే వారికి అదనంగా 0.25 వడ్డీ వస్తుంది.

శ్రీరామ్ ఫైనాన్స్ లో మూడేళ్లు ఎఫ్ డీ చేస్తే 7.60 శాతం వడ్డీ వస్తుంది. ఇందులోనూ సీనియర్ సిటిజన్లకు 0.15 శాతం వడ్డీ అడిషనల్ గా వచ్చేస్తుంది.

ఇక మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ సిండికేట్ కంపెనీలో మూడేళ్ల ఎఫ్​డీలపై 8.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో సీనియర్ సిటిజన్లకు చూసుకుంటే 0.25 వడ్డీ అడిషనల్ గా యాడ్ అవుతుంది.

మహింద్రా ఫైనాన్స్, సుందర్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలు మూడేళ్ల ఎఫ్ డీలపై 7 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 0.25 అడిషనల్ వడ్డీని అందిస్తున్నాయి.

మూడేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లలో చూస్తే.. కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సంస్థ 7.50 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.25 వడ్డీ అడిషనల్ గా ఇస్తోంది.

ఇవే కాకుండా బజాజ్ ఫైనాన్స్ లో మూడేళ్లకు 6.95 శాతం వడ్డీ, పీఎన్ బీలో మూడేళ్ల ఎఫ్ డీలకు 6.90 వడ్డీ, ఐసీఐసీఐలో మూడేళ్ల ఎఫ్ డీలకు 6.90 శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా కంపెనీలు ఫిక్స్ డ్ డిపాజిట్లపై మంచి వడ్డీని ఇస్తున్నాయి. కాకపోతే క్రెడిట్ స్కోర్ ను చూసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>