కలం, వెబ్ డెస్క్ : ఖమ్మంలో ఏర్పాటు సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా (D Raja ) ఆర్ఎస్ఎస్, బీజేపీ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సీపీఐ అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడారు.
1925 డిసెంబర్ 26 న ఆవిర్భంచిన సీపీఐ.. భారతదేశానికి బ్రిటీషర్స్ నుంచి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఆరంభంలోనే డిమాండ్ చేసిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ కీలకపాత్ర పోషించాయని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం సీపీఐ శ్రేణులు పోరాటం చేశాయని.. స్వరాజ్యం పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్నారు. అప్పటి బ్రిటీష్ పాలకులతో ఆర్ఎస్ఎస్ చేతులు కలిపిందని D Raja తీవ్ర ఆరోపణలు చేశారు.


