కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) నగరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడశిశువును చెత్త కుప్పలో వదిలేసి వెళ్లారు. నిజామాబాద్ నగరం ద్వారకా నగర్‌లో జరిగిన ఈ హృదయ విదారక దృశ్యం స్థానికులను కలచివేసింది. చెత్త కుప్పలో నుంచి పాప అరుపులు విని దారి వెంట వెళ్తున్న జనాలు ఒక్కసారిగా పాపను చూసి డయల్ 100 కు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు పాపను స్వాదీనం చేసుకొని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఐసీడీఎస్ (ICDS) అధికారులకు సమాచారం అందించడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉంది. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుంది. తల్లిదండ్రులే కావాలని వదిలించుకున్నారా ? లేక ఏం జరిగిందనే విషయమై విచారిస్తున్నట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. మొత్తానికి నిజామాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి.
చెత్తకుప్పలలో వదిలేసే అంత కర్కశ పరిస్థితి ఏంటని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని వదిలించుకున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలే పిల్లలు లేని జంటలు ఇలాంటి విషయాలు తెలిసి మరింత మనోవేదనకు గురవుతున్నారు.

Read Also: ముస్తాబైన మేడారం.. డ్రోన్ విజువల్స్, ఫొటోలు
Follow Us On: X(Twitter)


