కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మంలో (Khammam) ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ (CPI Centenary Meet) జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు విచ్చేస్తున్నారు. మొత్తం 40 దేశాల నుండి విచ్చేసిన అతిథులు పాల్గొననున్నారు. ఇప్పటికే వారంతా హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయనికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు.
సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు (CPI Centenary Meet) పాలస్తీనా నుంచి అబ్దుల్లా ఎమ్ ఏ బుష్ వేష్, సహర్, వెనిజులా నుంచి కల్దేర గుజ్మ, క్యూబా నుంచి మార్సన్ గులీర, వియత్నాం నుంచి ట్రాన్ తన్హా హాంగ్, సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటీ నరసింహ వీరికి స్వాగతం పలకనున్నారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, ఇతర పార్టీ నేతలతో కలిసి సాదర స్వాగతం పలుకుతూ రిసీవ్ చేసుకొన్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఐక్యత, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి ఇది బలమైన ప్రతీక అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
Read Also: ఆ మున్సిపాలిటీపై పొంగులేటి ఫోకస్
Follow Us On: X(Twitter)


