కలం వెబ్ డెస్క్ : కొంతమంది ట్రిప్‌లకు వెళ్లినప్పుడు సరదా కోసం చేసే పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సంతోషంగా ముగియాల్సిన పర్యటనలు తీరని విషాదాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో (Arunachal Pradesh) ఓ విషాదకర ఘటన జరిగింది. చలికాలంలో అరుణాచల్ అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులకు తీరని దుఖాన్ని మిగిల్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా సరస్సు (Sela Lake) చలి తీవ్రతకు గడ్డకట్టపోయింది. దీంతో పర్యాటకులు సరస్సులోకి దిగి మంచుపై ఫోటోలు దిగుతున్నారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా మంచు విరిగిపోయింది. దీంతో ఇద్దరు పర్యాటకులు నీటిలోకి పడిపోయారు. ఈత రాకపోవడం, లోతు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. పక్కనే ఉన్నవారు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ, లాభం లేకపోయింది. ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. అధికారులు ఓ మృతదేహాన్ని పైకి తీశారు. మరో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. మృతి చెందిన ఇద్దరూ కేరళకు చెందిన పర్యాటకులుగా (Kerala Tourists) గుర్తించారు.
ప్రాణం తీసిన ఫోటోల సరదా.. సరస్సులో పడి ఇద్దరు మృతి
Two tourists from Kerala drowned in the Sela Lake in Arunachal Pradesh’s Tawang district
#ArunachalPradesh #SelaLake #KearalTourists #Kearala #Kalam #Kalamdaily #Kalamtelugu pic.twitter.com/Fvm4w0Z2WX— Kalam Daily (@kalamtelugu) January 17, 2026
Read Also: మనిషి చావుబతుకుల్లో ఉంటే.. చేపల కోసం ఎగబడ్డరు!!
Follow Us On : WhatsApp


