కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. గ్రీన్ ఎనర్జీ(Green Energy) రంగంలో ఆంధ్రప్రదేశ్ సౌదీ అరేబియాగా మారె దిశగా అడుగులు వేస్తుంది. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ వరకు సప్లై చేస్తామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం గ్లోబల్ హబ్‌గా మారుతుంది. రాబోయే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడుల వల్ల 8000 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బిగ్ రివీల్ కోసం ఎదురుచూడండి అంటూ లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రాష్ట్రంలో భారీ పెట్టుబడుల గురించి ప్రకటన ఉండబోతున్నట్లు సమాచారం.


