కలం, వెబ్ డెస్క్: గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నం’ సినిమా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్లు సాధించింది. మరోసారి దర్శకుడు అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (MSVPG) ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ యాక్టింగ్, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్ ఈ మూవీకి హైలైట్‌గా నిలిచాయి. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో MSG అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి (Chiranjeevi) ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అవతరిస్తోంది. ఈ సినిమా నాల్గవ రోజు అద్భుతమైన బిజినెస్‌ను నమోదు చేసింది. సంక్రాంతి సెలవులు కూడా మరింత ప్లస్ అయ్యింది. ప్రతి థియేటర్ హౌస్‌ఫుల్‌తో నడుస్తోంది. ఫలితంగా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 190 కోట్లను రాబట్టింది. త్వరలోనే 200 కోట్ల మార్క్ అందుకోబోతోంది. మొదటిరోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇది కూడా కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది.


