కలం వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్(Israel) మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం(Indian Embassy) పలు సూచనలు చేసింది. ఇజ్రాయెల్‌లోని ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారతీయులు జాగ్రత్తగా ఉంటూ, ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇచ్చిన భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని ప్రకటించింది. అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని సూచించింది. ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో భారత్ ఎంబసీ హెల్ప్‌లైన్ ద్వారా సహాయం అందిస్తుందని తెలిపింది. సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు +972-54-7520711, +972-54-3278392, cons1.telaviv@mea.gov.in ఈమెయిల్ అడ్రస్‌లో సంప్రదించాలని సూచించింది.


