కలం, వెబ్ డెస్క్: నాన్ వెజ్ (Non Veg) ప్రియులకు ఇది నిజంగా షాక్. పండుగ రోజు చికెన్, మటన్ తినాలనుకునేవారికి ధరలు నిరాశను కలిగిస్తున్నాయి. శుక్రవారం కనుమ పండుగ కావడంతో నాన్ వెజ్ దుకాణాలకు జనాలు పోటెత్తారు. చికెన్, మటన్ కొనేందుకు జనం బారులు తీరారు. వ్యాపారులు సాధారణ రోజుల కంటే రేట్లను పెంచేశారు. హైదరాబాద్ లో కేజీ మటన్ ధర రూ.1050 ఉండగా, చికెన్ ధర రూ.300 ఉంది.
ఇక ఏపీ (Andhra Pradesh)లోనూ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో బ్రాయిలర్ చికెన్ ధరలు కిలోకు రూ.300 దాటాయి. స్కిన్ లెస్ చికెన్ రూ.350 నుంచి 450 దాకా ఉంది. ‘మేం సాధారణంగా రోజుకు 100 కిలోల చికెన్ అమ్ముతాం. ఇది వీకెండ్స్‌లో దాదాపు 200 కిలోలు అమ్ముతాం. సంక్రాంతి సీజన్ కావడంతో భారీగా చికెన్ ఆర్డర్లు వచ్చాయి. అందుకే రేట్లు పెరిగాయి’ అని అంటున్నారు వ్యాపారులు.


