epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

యాభై ఏండ్లుగా నిద్రపోని జాయింట్ కలెక్టర్

కలం, తెలంగాణ బ్యూరో : ఒక్క రోజు నిద్ర లేకుంటే మనం మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడతాం. కానీ యాభై ఏండ్లుగా ఒక్క సెకను కూడా నిద్రపోలేదంటే మనం నమ్మలేం. ఇది విచిత్రంగా అనిపించానా అక్షరాలా నిజం. వైద్య నిపుణులను సైతం ఈ అంశం విస్మయానికి గురిచేసింది. ఒక్క సెకను నిద్రపోకున్నా ఆరోగ్యంగానే ఉన్నారని, వృత్తిలోగానీ రోజువారీ పనుల్లోగానీ ఎలాంటి తేడా లేదని ఆయన భార్య సైతం చెప్తున్నారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు సైతం ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా చాణక్యపురి కాలనీలో నివసిస్తున్న రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ మోహన్‌లాల్ ద్వివేది (Mohanlal Dwivedi) మాత్రం 1973 నుంచి నిద్రపోలేదు. లెక్చరర్‌గా 1973 తన ప్రస్తానాన్ని ప్రారంభించారు. మరుసటి సంవత్సరమే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. తాసీల్దార్‌గా ఉద్యోగంలో చేరారు. 2001లో జాయింట్ కలెక్టర్‌గా రిటైర్ అయ్యారు. తాసీల్దార్‌గా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక్క సెకను కూడ నిద్రపోకుండానే ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్ :

ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు స్థానికంగా ఉండే డాక్టర్లంతా సగటున మనం కనీసం రోజుకు ఆరు గంటల నిద్ర అవసరమని చెప్తుంటారు. ఒక్క రోజు కాస్త ఎక్కువసేపు పనిచేసి నిద్ర తగ్గినా, ఏదేని కారణాలతో సౌండ్ స్లీప్ లేకపోయినా మరుసటిరోజు పనిపై ఆ ప్రభావం కనిపిస్తుంది. నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నిద్ర లేకుండా హాఫ్ సెంచరీ కొట్టిన ద్వివేదీకి మాత్రం నిద్ర అవసరమనే ఫీలింగే ఉండదంట. రాత్రిపూట ఇంటి మిద్దమీద కూర్చుకుని ఆలోచనలోనే మునిగిపోతారు.. లేదా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు.. లేదా నడుస్తూ టైమ్ పాస్ చేస్తారు.. కానీ నిద్రలోకి జారుకోరంట. శరీరం అలసిపోవడమో లేక జ్ఞాపకశక్తి తగ్గిపోవడమో లేక మానసిక ఒత్తిడికి గురికావడమో.. ఇవేవీ ఉండవని ఆయన చెప్తున్నారు. ఆయనను శారీరకంగా పరీక్షించిన డాక్టర్లు సైతం ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.

సైన్స్ కే సవాలుగా ద్వివేదీ లక్షణాలు :

లెక్చరర్‌గా 1973లో ఉద్యోగం మొదలుపెట్టినప్పుడే నిద్ర అవసరం లేదనే లక్షణాలు ఆయనలో మొదలైనట్లు వైద్యుల పరీక్షల ద్వారా తెలిసింది. అప్పుడు అనుకోకుండా జరిగిన ఒక వింత పరిస్థితి దీనికి కారణమని వైద్యులకు చెప్పారే తప్ప దాని పూర్తి వివరాలు మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయాయి. రోజంతా మేలుకునే ఉండడం, నిద్రపోకుండా పనుల్లో మునిగిపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వైద్యుల దగ్గరకు తీసుకెళ్ళారు. ఏమీ లేదని తేలింది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి నగరాల్లోని ప్రముఖ ఆస్పత్రులకూ తీసుకెళ్ళి చూపించారు. కానీ ఎలాంటి తేడాలు లేవనే డాక్టర్లు తేల్చారు. కారణాలను వైద్యులు పసిగట్టలేకపోయారు. అప్పటి నుంచీ నిద్ర లేకుండానే 50 ఏండ్లు గడిచిపోయింది. నిద్రే లేకుండా ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారన్నదే ఇప్పుడు వైద్యులకు మింగుడుపడని అంశం. ఒక రకంగా వైద్యశాస్త్రానికే ద్వివేదీ (Mohanlal Dwivedi) నిద్ర అలవాటు సవాలుగా మారింది.

లోతుగా పరిశోధించాల్సిందే : డాక్టర్ రాహుల్

మోహన్‌లాల్ ద్వివేదీకి చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి అబ్‌నార్మల్ కండిషన్ బైటపడలేదని, 75 ఏండ్ల వయసులోనూ శారీరకంగా, మానసికంగా దృఢంగానే ఉన్నారని రేవాలోని సంజయ్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మిశ్రా అన్నారు. వైద్యశాస్త్రం కోణం నుంచి నుంచే ద్వివేదీ లైఫ్ స్టైల్ ఒక ఆశ్చర్యకరమైన అంశమేనని అన్నారు. కానీ అది ఎలా సాధ్యమైందనేది తేలాలంటే మాత్రం లోతుగా పరిశోధన చేయాల్సిందేనని అన్నారు. ప్రస్తుతానికి ఆయన జీవనశైలి, నిద్రపోవాలనే ఫీలింగే లేకపోవడం వైద్యశాస్త్రానికే ఒక సవాలు వంటిదని, ఇది జీర్ణించుకోలేని వాస్తవమని అన్నారు. అటు ఫిజియాలజీపరంగా, ఇటు సైకాలజీపరంగా లోతైన పరిశోధనలు చేసిన తర్వాత మెదడు-నిద్రకు సంబంధించిన సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు. మోహన్‌లాల్ భార్య సైతం రోజుకు మూడు గంటలకంటే ఎక్కువసేపు నిద్రపోరని డాక్టర్ రాహుల్ మిశ్రా వివరించారు.

Read Also: ఎయిర్​ ఇండియా కేసులో ట్విస్ట్​.. పైలెట్​ బంధువుకు నోటీస్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>