కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ మున్సిపాలిటీనీ (Nalgonda Municipality) కార్పొరేషన్ గా మారుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నల్లగొండకు కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేసింది. దీంతో పాలనపరంగా నల్లగొండకు ఎక్కువ అధికారాలు కల్పించడంతో పాటు విస్తృత పరిధి పెరగనుంది. నల్లగొండ అభివృద్ధికి నిధులు పెరగడంతో పాటు కొన్ని కేంద్ర పథకాలు సైతం నేరుగా అందే చాన్స్ ఉంటుంది. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డులతోపాటు కొత్తవార్డుల పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ స్థానంలో మేయర్, డిప్యూటీ మేయర్ వ్యవస్థ అందులో అందుబాటులోకి రానుంది. కమిషనర్‌గా ఐఏఎస్ స్థాయి అధికారులు రావడం వల్ల పాలన మరింత పటిష్టంగా ఉండనుంది. కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం అవుతుంది. పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్‌లో కార్పొరేషన్ నిబంధనలు అమలుకానున్నాయి. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ విధానాల్లో మార్పు వస్తుంది.

Read Also: రాహుల్ హామీ బేఖాతర్.. నల్లగొండలో ‘రెడ్డి’లదే పెత్తనం!!
Follow Us On : WhatsApp


