కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సంక్రాంతి (Sankranti) శుభాకాంక్షలు తెలిపారు. మన తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. రైతన్నల కష్టాలు ఫలించి పంటలు ఇంటికొచ్చే వేళ.. మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని తెలిపారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, కనుమ వంటలు, పశుసంపదకు పూజలతో.. ప్రతీ ఇంటిలో, ప్రతీ పల్లెలో సంతోషం నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ (Super Six) పధకాల అమలుతో ప్రతీ ఒక్కరిలో సంతృప్తిని కలిగించింది. గత ప్రభుత్వం విధించిన విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడకుండా ఉపశమనం కలిగించామని అన్నారు. సంక్షేమం, అభివృద్ది చేసి చూపిస్తున్నాం. మరింత సంతోషంగా ప్రజలు పండుగ జరుపుకునేలా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు.
Read Also: లండన్లో పాక్ ముఠా అరాచకం.. సిక్కు మైనర్ బాలిక గ్యాంగ్ రేప్
Follow Us On : WhatsApp


