కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో రెండో వన్డే జట్టు ఎంపికపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ (Sitanshu Kotak) స్పందించారు. ఈ జట్టు కూర్పులో ఎటువంటి వివాదాలకు తావు లేదని పేర్కొన్నారు. ఈ సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి వన్డే సమయయంలో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయపడటంతో అతడి స్థానంలో ఆయుష్ బదోనీని తీసుకున్నారు. కాగా ఆయుష్ ఎంపిక అనేక విమర్శలకు దారి తీసింది. కేవలం గంభీర్‌కు కావాల్సిన వాడు కావడంతోనే ఆయుష్‌కు అవకాశం వచ్చిందని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. స్పిన్ ఆల్‌రౌండర్ స్థానంలో పార్ట్‌టైమ్ బౌలర్‌ను ఎందుకు తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నించారు. గంభీర్‌కు (Gautam Gambhir) ఇష్టమైన ఆటగాడన్న కారణంతోనే బదోనికి ఛాన్స్ దక్కిందన్న రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఆరోపణలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పందించారు. అలాంటిదేమీ లేదని వివరించారు.
భారత్ ఏ జట్టులో అద్భుత ప్రదర్శనతో పాటు ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణించడంతోనే బదోనిని ఎంపిక చేసినట్లు సితాంశు స్పష్టం చేశాడు. ఐదుగురు బౌలర్లతో మాత్రమే మ్యాచ్ ఆడటం కష్టమని, అదనపు బౌలింగ్ ఆప్షన్‌గా బదోనీ ఉపయోగపడతాడని వివరించాడు. రెండో వన్డేలో ఐదుగురు బౌలర్లతో భారత్ బరిలోకి దిగి ఉంటే.. చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేదన్నాడు. అందుకే ప్రతి జట్టు ఒక ఎక్స్‌ట్రా బౌలర్‌తో బరిలోకి దిగుతోందని అన్నారు. బదోనీ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడని అందుకే ఎంపిక చేశామని సితాంశు క్లారిటీ ఇచ్చాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 693 పరుగులు చేసిన బదోని ఐపీఎల్‌లోనూ 900కు పైగా పరుగులు సాధించాడని గుర్తు చేశాడు.

Read Also: శతక్కొట్టిన కేఎల్ రాహుల్
Follow Us On: Instagram


