epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నిజాన్ని అంగీకరించిన శ్రీలీల

కలం, సినిమా: హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నిజాన్ని అంగీకరించింది. తనకు ఇప్పటిదాకా డ్యాన్సులు, సాంగ్స్ తోనే పేరొచ్చిందని ఒప్పుకుంది. తమిళంలో ఆమె నటించిన పరాశక్తి సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 60వ దశకంలో తమిళనాట జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంగా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను రూపొందించారు. శివకార్తికేయన్, అధర్వ కీ రోల్స్ చేశారు. శ్రీలీల ఈ సినిమాలో పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో నటించింది. ఆమెకు ఇప్పటిదాకా నటిగా ఏ సినిమాలోనూ పేరు రాలేదు. కేవలం గ్లామర్ షో, డ్యాన్సులతోనే ఫేమ్ అయ్యింది శ్రీలీల.

రీసెంట్ గా జరిగిన పరాశక్తి (Parasakthi) సినిమా ప్రెస్ మీట్ లో శ్రీలీల మాట్లాడుతూ.. తనకు తొలిసారి నటిగా పేరొచ్చిందని చెప్పింది. ఇది హీరోయిన్ గా తనకు రియల్ డెబ్యూగా చెప్పుకుంది. ఇప్పటిదాకా కేవలం డ్యాన్సులు, పాటల్లోనే తనను ప్రేక్షకులు ఇష్టపడ్డారని, కానీ ఫస్ట్ టైమ్ పరాశక్తి సినిమాలో తన నటనను మెచ్చుకుంటున్నారని శ్రీలీల పేర్కొంది. థియేటర్స్ నుంచి ప్రేక్షకులు ఒక ఎమోషన్ తో బయటకు వస్తారని శ్రీలీల చెప్పింది. శ్రీలీల మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఆమె తన కెరీర్ గురించి రియలైజ్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నటిగా తనకు పేరు అందించిన పరాశక్తి సినిమా కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. ఈ సినిమా మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో చూపించిన కథా కథనాలపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇవన్నీ కొందరు కావాలని క్రియేట్ చేస్తున్నారంటూ డైరెక్టర్ సుధా కొంగర అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>