కలం, వెబ్ డెస్క్: దేశమంతటా సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. అనేక రాష్ట్రాల్లో ప్రజలు భోగి మంటలను వేస్తూ పండుగను జరుపుకుంటున్నారు. భోగి (Bhogi) మంటల కారణంగా బుధవారం దట్టమైన పొగమంచు ఏర్పడింది. పలు జాతీయ రహదారులు, హైవేలు, ఎయిర్‌పోర్ట్స్‌ను పొగమంచు కమ్మేసింది. దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్ట్స్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో లాంటి నగరాల్లో విమానాలు ఆలస్యమవుతున్నాయి. మరికొన్ని చోట్ల విమాన వేళ్లలో మార్పులు చేశారు. ఆకాశాన్ని కప్పేసిన పొగమంచు కారణంగా దృశ్యమానత ఏర్పడి విమానాల రాకపోకలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి.
పొంగల్ పండుగలో భాగమైన భోగి పండుగలో వ్యవసాయ వ్యర్థాలు, పాత వస్తువులను సాంప్రదాయకంగా దహనం చేస్తారు. ఇది వేడుకల సమయంలో వాయు కాలుష్యానికి దారితీస్తోంది. ఫలితంగా ఏర్పడే పొగమంచు తరచుగా గాలి నాణ్యత మరియు దృశ్యమానతను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం విమానయాన కార్యకలాపాలపై పడింది. అయితే విమానాశ్రయానికి (Airport) సమీపంలోని వ్యర్థాలను కాల్చకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


