కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ “ది రాజాసాబ్” (The Raja Saab). టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ అంచనాలతో ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడ్డారు. దీనితో ఆ సీన్స్ యాడ్ చేస్తున్నట్లు డైరెక్టర్ మారుతి స్వయంగా ప్రకటించారు.
అయితే తాజాగా డైరెక్టర్ మారుతి (Maruthi) రాజాసాబ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ తనకు సపోర్ట్ గా నిలిచారని తెలిపారు. మూవీ గురించి ఎక్కువ అప్డేట్‌గా ఉంటూ నిత్యం నాతో టచ్‌లో ఉంటారని మారుతి తెలిపారు. “డోంట్ వర్రీ.. కొత్త ప్రయత్నం చేశాం అది ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి టైమ్ పడుతుంది” అని అన్నారు. రీసెంట్ గా యాడ్ చేసిన సీన్స్ గురించి ప్రభాస్ కు మెసేజ్ చేయగా ‘ఆ సీన్స్ బాగా సెట్ అయ్యాయని’ చెప్పినట్లు మారుతి తెలిపారు.
Read Also: కోహ్లీపై మంజ్రేకర్‌వి పిచ్చి కూతలు: కైఫ్
Follow Us On: X(Twitter)


