కలం, డెస్క్: ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ మళ్లీ ఉద్యోగులను తొలగించేందుకు (TCS layoffs) సిద్ధమవుతున్నది. కొత్త ఏడాదిలోనూ లే ఆఫ్స్, ఫైరింగ్ తప్పదని పేర్కొంది. గత ఆరు నెలల్లో 30 వేల మందిని ఇంటికి పంపిన ఈ దిగ్గజ కంపెనీ.. వచ్చే ఆరు నెలల్లోనూ అదే స్థాయిలో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. పెరుగుతున్న ఏఐ (AI) వినియోగం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఉద్యోగుల విభజన తప్పడం లేదని.. ఇందులో భాగంగానే గత మూడు నెలల్లో 11 వేల మందిని తొలగించినట్లు వెల్లడించింది. ఇది ఇంతటితో ఆగదని స్పష్టం చేసింది. కంపెనీ మంగళవారం తన క్వార్టర్స్ రిజిల్ట్స్ ను ప్రకటించింది. ఉద్యోగులను తీసివేయడానికి గల కారణాలను ఇందులో పేర్కొంటూనే.. ఇది ఆగేలా లేదని సంకేతాలు ఇచ్చింది. వరుసగా దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం టెకీల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నది.
Read Also: చట్టాలు చేసేవారే ఉల్లం’ఘనులు’
Follow Us On : WhatsApp


