కలం, వెబ్ డెస్క్ : వైద్యశాఖలో త్వరలోనే 10 ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Raja Narasimha) అన్నారు. కొత్తగా సెలెక్ట్ అయిన 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. వైద్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర ఎంతో కీలకం అన్నారు. ఒక వ్యాధిని గుర్తించాలంటే ల్యాబ్ టెక్నీషియన్ లేనిది సాధ్యం కాదని మంత్రి రాజనర్సింహ తెలిపారు.
వైద్య శాఖలో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నామని మంత్రి దామోదర చెప్పారు. ఇప్పటికే 10వేల పోస్టులు ఇచ్చామని.. త్వరలో మరో 10వేల పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని.. అందులో భాగంగానే పెద్ద ఎత్తున వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్యచికిత్స అందించే బాధ్యత వైద్య శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పుకొచ్చారు మంత్రి రాజనర్సింహ.

Read Also: వీబీ-జీ రామ్ జీ పథకం అద్భుతం: బండి సంజయ్
Follow Us On: Sharechat


