కలం, స్పోర్ట్స్: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈజీ ఫార్మాట్‌ను ఎంచుకున్నాడంటూ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Kaif) తీవ్రంగా ఖండించాడు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని, అతనికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరని స్పష్టం చేశాడు. క్రికెట్లో ఏ ఫార్మాట్ కూడా సులువు కాదని తేల్చిచెప్పాడు.
టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ సులువైన ఫార్మాట్‌ను ఎంచుకున్నాడని మంజ్రేకర్ (Manjrekar) విమర్శించాడు. దీనిపై స్పందించిన కైఫ్(Kaif), కోహ్లీ టెస్ట్‌ల్లోనే తొమ్మిది వేలకుపైగా పరుగులు చేసి ముప్పై సెంచరీలు సాధించాడని గుర్తు చేశాడు. అలాంటి ఆటగాడు కష్టమైన ఫార్మాట్‌ను వదిలేశాడని అనడం మూర్ఖత్వమేనని స్పష్టం చేశాడు.
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో కోహ్లీ తొంభై మూడు పరుగులు చేసినా సెంచరీ చేయలేదని అభిమానులు బాధపడుతున్నారని కైఫ్ చెప్పాడు. కోహ్లీపై ఉన్న అంచనాలే దీనికి కారణమని వ్యాఖ్యానించాడు.
Read Also: ‘2025లో నేను నమ్మకాన్నే కోల్పోయా’
Follow Us On: X(Twitter)


