epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇరాన్​లో ఆగని హింస.. 2వేల మంది మృతి

కలం, వెబ్​డెస్క్​: ఇరాన్ (Iran) ​లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చల్లారడం లేదు. దేశ కరెన్సీ విలువ దారుణంగా దిగజారడం, ద్రవ్యల్బణం పెరగడం, వ్యాపారాలు మూత పడడంతో రెండు వారాల కిందట మొదలైన ప్రజల నిరసనలు అంతకంతకూ ఉద్ధృతంగా జరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్​ అయతొల్లా ఖొమేనీని పదవి నుంచి దిగిపోవాలంటూ నిరసనకారులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు, సైనిక దళాలు నిరసనకారులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాయి. ఈ ఘర్షణల్లో 2వేల మందికి పైగా మరణించినట్లు ఇరాన్​ ప్రభుత్వాధికారి ఒకరు మంగళవారం వెల్లడించడం పరిస్థితి తీవ్రతను చెప్తోంది. అలాగే 10వేల మందికిపై పైగా పౌరులను నిర్బంధించినట్లు చెప్పారు. నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఆందోళనలు, అణచివేత బయటికి ప్రపంచానికి తెలియకుండా ఇప్పటికే ఇంటర్నెట్​ను ఖొమేనీ ప్రభుత్వం బంద్​ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయంటే 1979లో ఇరాన్​లో రాచరిక పాలన అంతమైనప్పటి రోజులను గుర్తుకు తెస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

దేనికైనా సిద్ధమే: ఖొమెనీ

ఇరాన్ (Iran) ​లో నిరసనకారులను చంపుతుండడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకుంటే తాము నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. అయితే, ట్రంప్​ హెచ్చరికలను ఇరాన్​ లెక్కచేయడం లేదు. దౌత్య చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధమేనని ఖొమేనీ ప్రతినిధి వెల్లడించారు. కాగా, ఇరాన్​లో అల్లకల్లోలంపై ట్రంప్​ జోక్యం చేసుకోవాలని, ఇరాన్​ రాజ వంశస్తుడు, విదేశాల్లో తలదాచుకుంటున్న రెజా పెహ్లావీ కోరుతున్నారు. మరోవైపు ఇరాన్​ విషయంలో ఇజ్రాయెల్​ అప్రమత్తమైంది. తమపై అమెరికా దాడి చేస్తే తాము ఇజ్రాయెల్​ను టార్గెట్​ చేసుకుంటామని ఇరాన్​ హెచ్చరించడం దీనికి కారణం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>