కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu). ఫన్టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ నెల 12న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ అదిరిపోయే కామెడీ టైమింగ్తో అద్భుతంగా నటించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఛాన్నాళ్ళ తరువాత బాస్ పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చారని ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు. అయితే మెగాస్టార్ అంటేనే వెంటనే గుర్తొచ్చేది ఆయన చేసే డాన్స్ మొమెంట్స్. అదిరిపోయే స్టెప్స్ కి మెగాస్టార్ గ్రేస్ కలిస్తే ఆ స్టెప్స్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం.
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా మెగాస్టార్ హుక్ స్టెప్ (Hook Step) అంటూ మరోసారి అదరగొట్టారు. హుక్ స్టెప్ సాంగ్ రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రీల్స్ అదరగొడుతున్నారు. అయితే ఆ హుక్ స్టెప్ ను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ సందీప్ (Choreographer Sandeep) కు మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ హుక్ స్టెప్ ఐడియా ఎలా వచ్చిందో సందీప్ వివరించారు.
మనిషి జీవితంలో సమస్యలు ఉండటం సహజం. నేను ప్రతీ నెల ఈఎంఐలు కట్టుకోవాల్సి వచ్చేది. ఈ సాంగ్ కంపోజ్ చేసే సమయంలో కూడా ఈఎంఐ కట్టాలని ఫోన్స్ వచ్చాయి. అయితే సాంగ్ కంపోజింగ్ సమయంలో నేను ఫోన్ తీసుకెళ్లను. ఆరోజు ప్రొడక్షన్ వారు ఫోన్ చేస్తారని చెప్పడంతో తప్పని పరిస్థితిలో ఫోన్ తీసుకెళ్లానని సందీప్ తెలిపారు. ఆ సమయంలో కూడా వరుస ఫోన్ కాల్స్ రావడంతో ఫోన్ పగలకొట్టేద్దాం అనుకున్నా, కానీ తళుక్కున ఒక ఐడియా వచ్చింది. లైట్స్ అన్నీ ఆపేసి ఫోన్ ఫ్లాష్ లైట్ తో ఈ హుక్ స్టెప్ కంపోజ్ చేశా.. అది చూసి నా భార్య చప్పట్లు కొట్టింది. దీనికి మెగాస్టార్ గ్రేస్ యాడ్ చేసి పర్ఫెక్ట్ మూమెంట్ సిద్దం చేసినట్లు సందీప్ తెలిపారు. ఈ మూమెంట్ చేశాక మెగాస్టార్ గారు నన్ను మెచ్చుకోవడం జీవితంలో గొప్ప అచీవ్మెంట్గా భావించానని సందీప్ తెలిపారు.


