కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ (IAS) అధికారుల బదిలీలు, నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న పి. శ్రీనివాసులు మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. గోపాలకృష్ణ రోనంకిని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్‌ను సివిల్ సప్లయ్స్ డైరెక్టర్‌గా నియమించగా, కల్పన కుమారి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
మయూర్ అశోక్ గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా, ఆర్. గోవిందరావు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే నిధి మీనా (కడప), సి. విష్ణు చరణ్ (అనంతపురం), సూర్యతేజ (అనకాపల్లి), ఆదర్శ్ రాజేంద్రన్ (చిత్తూరు), విద్యాధరి (విశాఖపట్నం), శివ్ నారాయణ్ శర్మ (అన్నమయ్య), సంజనా సింహ (పల్నాడు) జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా నియమితులయ్యారు. బదిలీ అయినప్పటికీ ఇంకా పోస్టింగ్ కేటాయించని అధికారుల నియామక ఉత్తర్వులు వేరుగా జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


