కలం వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించేందుకు తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ (Polavaram Nallamala Sagar) ప్రాజెక్ట్‌పై సుప్రీం కోర్ట్‌లో (Supreme Court) సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీనిపై సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రాజెక్టు విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల వాదనలు వినాల్సి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. గోదావరి నదీ జలాలు వినియోగించే రాష్ట్రాలన్నీ ఇందులో భాగస్వాములేని కోర్ట్ వ్యాఖ్యానించింది.
కృష్ణా బేసిన్‌కు నీటి తరలింపుతో ఆ రాష్ట్రాల వాదనలూ అవసరమని స్పష్టం చేసిది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు అనుమతించింది. ఈ కేసు విచారణ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) సుప్రీం కోర్ట్‌కు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్ట్ (Polavaram Nallamala Sagar) ఎవరికీ నష్టం కలిగించదని, వృథాగా వెళ్లే నీటిని వాడుకుంటే నష్టం ఏమిటని సీఎం చంద్రబాబు అన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఇది అంతర్ రాష్ట్ర నిబంధనలకు విరుద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.
సివిల్ సూట్ అంటే ఏమిటి?
రెండు రాష్ట్రాలు లేదా వ్యక్తుల మధ్య హక్కులు, బాధ్యతలు, ఆస్తి, నీళ్లు, ఒప్పందాలు, నష్ట పరిహారం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారం కోసం కోర్ట్‌లో సివిల్ సూట్ దాఖలు చేస్తారు. ఇందులో ఆయా వ్యక్తులు, ప్రభుత్వాలు చేస్తున్న చర్యలను నిలిపి వేసే ఆదేశాలు రావొచ్చు. అలాగే వారి హక్కులు, నష్ట నివారణకు పరిహారం, చట్ట బద్ధతపై వాదనలు, ఆధారాలు పూర్తిగా పరిశీలించి తుది తీర్పు ఇస్తారు.
Read Also: బీఆర్ఎస్ ఖేల్ ఖతం: కిషన్ రెడ్డి
Follow Us On: Instagram


