epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ.. హుండీ, నగలు మాయం!

క‌లం వెబ్ డెస్క్ : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌రస్వామి ఆల‌యం (Venkateswara Swamy Temple)లో భారీ చోరీ జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు సీసీ కెమెరాల వైర్లు క‌త్తిరించి దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఆల‌యంలో బంగారు ఆభ‌ర‌ణాల‌ (Gold Ornaments)తో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. మొత్తంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు దోపిడీ జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. గ‌త న‌వంబ‌ర్‌లో ఇదే ఆల‌యంలో భ‌క్తులు ఎక్కువ సంఖ్య‌లో రావ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంత‌రం ఆల‌యంలో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌ను నిలిపివేశారు. ఇదే అదునుగా భావించిన దొంగ‌లు చోరీకి పాల్ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఆల‌యానికి చేరుకొని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: మిమ్మ‌ల్ని చూస్తేనే జాలేస్తుంది.. హ‌రీశ్ రావుకు కోమ‌టిరెడ్డి కౌంట‌ర్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>