కలం, వెబ్ డెస్క్: ట్రాన్స్‌జెండర్ (Transgender) అంటేనే.. సమాజంలో ఎన్నో అవమానాలు, వేధింపులు. అలాంటివారిని అక్కున చేర్చుకునేవారు ఉండరు. కానీ బీహార్‌కు చెందిన యువకుడు ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించాడు. కేవలం ప్రేమకు పరిమితం కాకుండా పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన ఎంతోమందిని కదిలించింది. సోని అనే ట్రాన్స్‌జెండర్ కోల్‌కతా మారుమూల గ్రామంలో ఉంటుంది. ఆమెకు బీహార్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమకు దారితీసింది. సోని ప్రేమను బహిరంగంగా అంగీకరించాడు.
అక్కడితో ఆగిపోకుండా సోనిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు బొట్టు పెట్టి, తాళి కట్టి భార్యగా స్వీకరించాడు. వీరి పెళ్లిని యువకుడి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. తల్లిదండ్రులు తమ కొడుకును మందలించారు. ‘మేం మనవళ్లు, మనవరాళ్లను కోరుకున్నాం.. నువ్వు ఇలా చేయడం సరైంది కాదు’ అంటూ మండిపడ్డారు. లింగమార్పిడి స్త్రీ జన్మనివ్వదని నమ్మారు. ఈ కారణంగా పెళ్లిని వ్యతిరేకించారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఆ యువకుడు సోనిని విడిచిపెట్టలేదు. భారతదేశంలో ట్రాన్స్‌జెండర్స్ ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు ఈ ఘటన అద్దం పడుతుంది.

Read Also: మిమ్మల్ని చూస్తేనే జాలేస్తుంది.. హరీశ్ రావుకు కోమటిరెడ్డి కౌంటర్!
Follow Us On: Sharechat


