కలం డెస్క్: లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురిపెట్టారు. నిన్నమొన్నటి వరకు వెనిజువెలా.. ఇప్పుడు క్యూబాపై (Cuba) కన్నేశారు. తన దేశ విదేశాంగ మంత్రి మార్క్ రుబియో..‘ క్యూబా ప్రెసిడెంట్’ అనే పదం వినడానికి చాలా సొంపుగా ఉందంటూ సోషల్ మీడియా ట్రూత్ లో ట్రంప్ పోస్టు చేశాడు. Sounds good to me! అని రాసుకొచ్చాడు. దీంతో క్యూబాను హస్తగతంలో చేసుకునే పనిలో ట్రంప్ ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. కాగా, క్యూబా చాలా సంవత్సరాల నుంచి వెనిజువెలా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఆ దేశ నియంతలకు ఊడిగం చేస్తున్నదని.. ఇప్పటికైనా తమతో క్యూబా డీల్ చేసుకోవాల్సిందేనని, లేకపోతే కుదరదంటూ మరో పోస్ట్ లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.


