కలం, వెబ్‌డెస్క్: వడోదరా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ (Virat Kohli) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మొదటి నుంచి దూకుడు మీదున్న విరాట్.. 91 బంతుల్లో 93 పరుగులు చేసి అవుటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 1 సిక్స్, 8 ఫోర్లున్నాయి. వన్డేల్లో ఇప్పటివరకు విరాట్ 53 సెంచరీలు చేశాడు.
సచిన్ తర్వాత కోహ్లీనే..
ఈ మ్యాచ్‌లో 93 పరుగులు చేసిన కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 42 పరుగుల స్కోరు వద్ద కోహ్లీ.. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న కుమార్ సంగక్కర (28,016 పరుగులు)ను అధిగమించి 28,017 పరుగులతో ముందంజ వేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అదే సమయంలో కోహ్లీ అతి వేగంగా 28 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా మరో రికార్డు నమోదు చేశాడు. మూడు ఫార్మాట్లు కలిపి 557 మ్యాచ్‌లు 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం అతడి స్థిరత్వానికి నిదర్శనం. ఈ ఘనతతో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏమిటో చూపించాడు.


