కలం, స్పోర్స్ట్ : న్యూజిలాండ్ (IND vs NZ) బ్యాంటింగ్ లైనప్ కుప్పకూలుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా బ్యాటర్లు తమ వికెట్లను సమర్పించుకుంటున్నారు. ఓపెనర్లు కాస్తంత నిలకడగా రాణించిన.. వారి వికెట్లు పడిన తర్వాత ఎవరూ ఆశించినంతగా రాణించలేదు. 146 పరుగుల దగ్గర 3 వికెట్ పడగా 173 పరుగుల దగ్గర నాలుగో వికెట్ పడింది. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బౌలింగ్‌లో గ్లెన్ ఫిల్లిప్స్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆఫ్‌సైడ్ కొట్టిన బాల్‌ను శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో డారిల్ మఛెల్ 35 బంతుల్లో 30 పరుగులు, మిఛెల్ హే 4 బంతుల్లో 4 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ తీశారు. కాగా పరుగులను కట్టడి చేయడంలో ప్రతి బౌలర్ తన మార్చ్ చూపించుకున్నాడు. ఫీల్డింగ్ విషయంలో కూడా భారత్ తన సత్తా కనబరుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 35.4 ఓవర్లకు 182/4 పరుగులు చేసింది.

Read Also: ఇన్‌స్టా యూజర్లకు అలెర్ట్.. 1.75కోట్ల మంది డేటా లీక్!
Follow Us On: Pinterest


