కలం వెబ్ డెస్క్ : న్యూజిలాండ్‌తో (New Zealand) జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జట్టు నుంచి రిషబ్ పంత్‌ను (Rishabh Pant) తొలగించింది బీసీసీఐ (BCCI). సిరీస్‌కు మరో రెండు రోజులే ఉన్న సమయంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. నెట్ ప్రాక్టీస్ సమయంలో పంత్.. కుడివైపు పొత్తి కడుపుకు పైభాగంలో కాస్తంత అసౌకర్యంగా ఫీల్ కావడంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎంఆర్ఐ స్కాన్స్ చేసిన తర్వాత, వైద్యులతో చర్చించిన తర్వాత.. పంత్‌కు ఆబ్లిక్ మజిల్ టియర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ కారణంగానే అతడిని జట్టు నుంచి తప్పించడం జరిగింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
జట్టు నుంచి పంత్ వైదొలగడంతో అతడి రీప్లేస్‌మెంట్‌పై సెలక్టర్లు మరోసారి మేథోమదనం ప్రారంభించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్ల కమిటీ.. పంత్ స్థానంలో ధృవ్ జురెల్‌కు అవకాశం కల్పించాలని భావించింది. అయితే న్యూజిలాండ్‌తో తలపడే జట్టులో ధృవ్.. బ్యాకప్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. మెయిన్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఉండనున్నాడు.
సరికొత్త ఇండియా స్క్వాడ్ ఇదే
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్).

Read Also: డబ్ల్యూపీఎల్‌కు యాస్తికా భాటియా దూరం.. అదే కారణం !
Follow Us On : WhatsApp


