కలం, స్పోర్ట్: విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఆరంభంలోనే గుజరాత్ జైంట్స్‌కు భారీ షాక్ తగిలింది. మిగిలిన సీజన్ మొత్తం నుంచి వికెట్ కీపర్ యాస్తికా భాటియా (Yastika Bhatia) దూరమైంది. ఈ సీజన్‌లో యాస్తికా ఆడటం ప్రారంభం నుంచే కొంచెం సందేహంగా ఉంది. ఈ క్రమంలోనే WPL యాక్షన్ సమయంలోనే బోర్డ్ ఫ్రాంచైజీలకు క్లియర్‌గా వివరించింది. ఏ టీమ్ అయితే యాస్తికాను ఎంచుకుంటుందో వాళ్లు ఆమె రీప్లెస్‌మెంట్ చేయలేరు అని. ఆ కండిషన్ ఉన్నప్పటికీ గుజరాత్ జైంట్స్, యూపీ వారియర్స్.. యాస్తికా కోసం బిడ్ వేశారు. ఇందులో రూ.50 లక్షలకు గుజరాత్ జైంట్స్.. యాస్తికాను గెలుచుకుంది.
గతేడాది అక్టోబర్‌లో యాస్తికా.. ఏసీఎల్ సర్జరీ(మోకాలి రీ కన్‌స్ట్రక్షన్ సర్జరీ) చేయించుకుంది. ఇప్పుడు ఆ సర్జరీ కారణంగానే WPL సీజన్‌కు యాస్తికా దూరమైంది. ఈ నేపథ్యంలోనే యాస్తికా ఆరోగ్యంపై గుజరాత్ జైంట్స్ కోచ్ మిచెల్ క్లింగర్ స్పందించారు. ‘‘రికవరీ సజావుగా సాగుతుందని భావిస్తున్నాను. WPL సీజన్ 5లో గుజరాత్ జైంట్స్ జర్సీలో మళ్ళీ నిన్ను ఫిట్‌గా చూడటాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.
గుజరాత్ జైంట్స్‌కు యాస్తికా ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి సీజన్ ఇదే. గతంలో యాస్తికా.. ముంబై తరఫున ఆడింది. మొత్తం 28 మ్యాచ్‌లో 18.74 యావరేజ్‌గా 13.45 స్ట్రైక్ రేట్‌తో 506 పరుగులు చేసింది. నేవీ ముంబై వేదికగా జరిగిన గుజరాత్ జైంట్స్, యూపీ వారియర్స్ మ్యాచ్ సమయంలో యాస్తికా.. టీమ్ ఓనర్స్‌తో కలిసి కనిపించింది. ఆ మ్యాచ్‌లో యూపీని గుజరాత్ 10 పరుగుల తేడాతో ఓడించింది.

Read Also: న్యూజిలాండ్ సిరీస్ నుంచి పంత్ ఔట్!
Follow Us On: Sharechat


