కలం, సినిమా: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) .. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అనిల్ రావిపూడి ఏ ఇంటర్ వ్యూ చేసినా.. ఈవెంట్ కోసం ఎక్కడకి వెళ్లినా.. టాలీవుడ్ కింగ్ నాగార్జునతో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది. ఈ విషయం గురించి అనిల్ రావిపూడి గతంలో కూడా స్పందించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా అనిల్ రావిపూడి మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తన మనసులో మాటలను బయటపెట్టాడు.
ఇంతకీ.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఏం చెప్పాడంటే.. తెలుగు సినిమాకి మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఈ నలుగురు హీరోలు ఫోర్ పిల్లర్స్ లాంటోళ్లు. నైటీస్ టైమ్ లో ఈ నలుగురు హీరోల సినిమాలు చూసి జనాలు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అలాంటి వాళ్లలో నేను కూడా ఒకడిని.. ఈ నలుగురు హీరోల్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గార్లతో సినిమాలు చేశాను. ఒక్క నాగార్జున గారితో చేయలేదు. అది కూడా అతి త్వరలోనే నెరవేరుతుంది అనుకుంటున్నాను. అది కనుక జరిగితే.. ఆ నలుగురు హీరోలతో సినిమాలు తీసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ నేనే అవుతాను అన్నారు అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి చెప్పడం చూస్తుంటే.. ఆల్రెడీ నాగార్జునతో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. గత కొన్ని నెలల క్రితమే సుప్రియతో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడట. నాగార్జున కూడా అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని తెలిసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాగ్ 101వ సినిమా అనిల్ రావిపూడితోనే ఉంటుంది అని సమాచారం. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Read Also: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫుల్ ఫన్ రైడ్ లా వుంటుంది – రవితేజ
Follow Us On: X(Twitter)


