కలం వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నుంచి చాలా రోజుల తర్వాత మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) లాంటి సినిమా రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. జనవరి 9న విడుదలైన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్లకు పాలాభిషేకాలు, టపాసులతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ చోట సినిమా థియేటర్‌లోనే బాంబులు పేల్చడంతో మంటలు చెలరేగాయి. ఒడిశా(Odisha)లోని రాయ్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
‘రాజాసాబ్’ (Raja Saab) సినిమా ప్రదర్శిస్తుండగా ప్రభాస్ ఎంట్రీ సీన్ సమయంలో అభిమానులు టపాసులు పేల్చారు. దీంతో స్క్రీన్ ముందున్న కాగితాలపై నిప్పురవ్వలు పడి భారీగా మంటలు చెలరేగాయి. థియేటర్ సిబ్బంది, కొందరు ప్రేక్షకులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్ బయట టపాసులు పేల్చాలి కానీ, ఇలా లోపల పేల్చడమేంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read Also: డబ్ల్యూపీఎల్‌కు యాస్తికా భాటియా దూరం.. అదే కారణం !
Follow Us On: X(Twitter)


