కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి(Sankranti)కి నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్(Hyderabad), విజయవాడ(Vijayawada) జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలు ఎక్కువగా ఉండటంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే భారీ ట్రాఫిక్ ఏర్పడింది. విజయవాడ వైపు రద్దీ ఎక్కువగా ఉండటంతో 11 టోల్ బూత్‌లను, హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్‌లను తెరిచి వాహనాలు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. శనివారం కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
పండుగ ముందు వీకెండ్ రావడంతో ఉద్యోగులకు సెలవులు(Holidays) కలిసొచ్చాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు సుమారు లక్షకు పైగా వాహనాలు ఏపీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక బస్టాండులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతో వివరీతమైన రద్దీ నెలకొంది. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి అదనపు బస్సులు, పలు స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రైవేటు సంస్థలు, వాహనాలు ఇదే అదునుగా ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి.

Read Also: కోడి పందేలపై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు
Follow Us On: X(Twitter)


