కలం, వెబ్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ 2026 (Union Budget) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఆ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 దాకా రెండు దశల్లో బడ్జెట్ (Union Budget) సమావేశాలు జరుగుతాయన్నారు. తొలి దశ సమావేశాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 దాకా.. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 దాకా జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
స్నేహపూర్వక చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో పాటు.. ఇండియా మీద అమెరికా విధిస్తున్న టారిఫ్ లు, దేశ ఆర్థిక విధానాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని సమాచారం. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత నుంచి చర్చలు ప్రారంభం అవుతాయి.


