కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలో ఇది కీలక ఘట్టం. 11వ సీజన్‌కు ముందు రెండు కొత్త జట్లు చేరడంతో లీగ్ మరింత విస్తరించింది. ఈ పరిణామంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్, అండర్–19 జట్టు మేనేజర్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) ఆనందం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతాలో స్పందించిన ఆయన, విజయవంతంగా వేలం నిర్వహించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పీఎస్‌ఎల్ నిర్వాహకులను అభినందిస్తూ కొత్త జట్ల యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, సియాల్‌కోట్ జట్లు లీగ్‌లోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని జిన్నా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఉత్కంఠభరిత వేలంలో హైదరాబాద్, సియాల్‌కోట్ కొత్త ఫ్రాంచైజీలుగా అధికారికంగా ఎంపికయ్యాయి. ఇవి పీఎస్‌ఎల్ 11వ సీజన్‌లో అరంగేట్రం చేయనున్నాయి. ఇప్పటికే ఉన్న కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్‌తో కలిసి పోటీపడతాయి.
హైదరాబాద్ (Hyderabad) ఫ్రాంచైజీని ఫవాద్ సర్వార్‌కు చెందిన ఎఫ్‌కేఎస్ గ్రూప్ రూ.1.75 బిలియన్ల బిడ్‌తో దక్కించుకోగా సియాల్‌కోట్ ఫ్రాంచైజీని హమ్జా మజీద్‌కు చెందిన ఓజెడ్ డెవలపర్స్ రూ.1.85 బిలియన్ల రికార్డు బిడ్‌తో సొంతం చేసుకుంది. ఈ భారీ పోటీ పీఎస్‌ఎల్ వాణిజ్య విలువ ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా చూపిస్తోంది. రెండు కొత్త జట్లు చేరడంతో 11వ సీజన్ ఇప్పటివరకు అతి పెద్ద ఎడిషన్‌గా మారింది. ఈ సీజన్ మార్చి 26 నుంచి మే 3 వరకు జరగనుంది.


