కలం వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సొంత నియోజకవర్గం పిఠాపురంలో (Pitapuram) శుక్రవారం సంక్రాంతి వేడుకలు (Sankranti Celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి మహోత్సవాల పేరిన నిర్వహిస్తున్న ఈ సంబరాలకు పవన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పవన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వేడుకలకు భారీ ఎత్తున తరలివచ్చారు. మూడు రోజుల పాటు ఈ సంబరాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్తకళలు, చేనేత కళ గొప్పదనాన్ని చాటేలా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. రానున్న మూడు రోజులు ఈ వేడుకల్లో భారీ ఎత్తున ప్రజలు పాల్గొననున్నారు.

Read Also: ఎలుకల మందు ఆర్డర్‌ను రిజెక్ట్ చేసిన డెలివరీ బాయ్.. నెటిజన్స్ హ్యాట్సాఫ్
Follow Us On: X(Twitter)


