కలం, వెబ్ డెస్క్ : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్‌కు పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది (Shaheen Afridi) వార్నింగ్ ఇచ్చాడు. ఫిబ్రవరి 15న కొలంబోలో వేదికగా దాయాది దేశాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పైనే తాజాగా షాహిన్ స్పందించాడు. తాము సమాధానాలు మాటల్లో కాదని, మైదానంలో చెప్తామని అన్నాడు. 2025 ఆసియా కప్ సందర్భంగా చోటు చేసుకున్న వివాదాలపై మాట్లాడిన షాహిన్ సరిహద్దు అవతల క్రీడాస్ఫూర్తి ఉల్లంఘన జరిగిందని వ్యాఖ్యానించాడు. తమ దృష్టి పూర్తిగా క్రికెట్‌పైనే ఉందని Shaheen Afridi తెలిపాడు.
ఆసియా కప్ సమయంలో భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్‌కు నిరాకరించారన్న ఆరోపణలు ట్రోఫీ స్వీకరణపై తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వివాదం గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు కొనసాగింది. ఈ అంశంపై వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ కూడా స్పందించారు. రాజకీయాలను పక్కన పెట్టి క్రీడాస్ఫూర్తిని కాపాడాలని సూచించారు. ఇలాంటి ఘటనలకు క్రికెట్లో స్థానం ఉండకూడదని హోల్డర్ వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


