కలం, వరంగల్ బ్యూరో : జనగామ (Jangaon) జిల్లా యూత్ కాంగ్రెస్ (Youth Congress) అధ్యక్షులు బోనాసి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటిఆర్ (KTR) చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా లో కేటీఆర్ బొమ్మను ఉరితీశారు. ఈ సందర్బంగా యూత్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీని దూషించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అంటూ కేసీఆర్, కేటీఆర్ సకుటుంబంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్ల పైన పడిన విషయం గుర్తు చేసారు.
సోనియా గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోనే ఈరోజు మనం అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రం అని, ఇంకోసారి కాంగ్రెస్ నాయకత్వం పైన నోరు జారితే తమ చెప్పులతో బుద్ధి చెప్పాల్సి వస్తుంది అని యూత్ కాంగ్రెస్ నాయకులు (Youth Congress) హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మిట్టపల్లి వెంకటేష్ , మండల అధ్యక్షులు ఎద్దు హరీష్, ఎండి అబ్బాస్, మారబోయిన ప్రకాష్, నియోజకవర్గ నాయకులు చిటకోయిలా హరీష్ , రాకేష్, ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ జస్లీన్, కో కోఆర్డినేటర్ పడిగం మహేష్, మండల పట్టణ యూత్ నాయకులు విజయ్, సోహెల్ శ్రేష్మాన్, కనకరాజ్, నిఖిల్ ఉదయ్ లక్కీ, అరవింద్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Read Also: ఆడబిడ్డ ఇష్యూ.. అడకత్తెరలో ఆ ముగ్గురు!
Follow Us On: X(Twitter)


