మోటారు వైర్ల దొంగలను పట్టుకున్న రైతులు!

కలం, నిర్మల్ రూరల్: వ్యవసాయ విద్యుత్ మోటారు వైర్లను దొంగిలిస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ (Akkapur) గ్రామానికి చెందిన రైతు సాయన్న వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ మోటారు వైర్లను కత్తిరించి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు రైతుకు తారసపడ్డారు.

వారు అక్కడికి ఎందుకు వచ్చారనే ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన రైతు వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా మోటారు వైర్లు బయటపడ్డాయి. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారంతా కలిసి ఇద్దరినీ పట్టుకుని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>