కలం, వెబ్‌డెస్క్: నియోపోలిస్ భూముల (Neopolis Land) వేలంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలానికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. మొత్తం 4.59 ఎకరాల భూమికి కనీస ధరగా రూ.120 కోట్లను అధికారులు నిర్ణయించారు. అయితే వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వేలం ప్రక్రియను రద్దు చేశారు. గత సెప్టెంబర్ లో సైతం ఈ భూముల వేలం నిర్వహించారు. రూ.120 కోట్లతో ఒకే బిడ్ దాఖలు కావడంతో అప్పుడు రద్దు చేశారు.
ఇదే సమయంలో కూకట్‌పల్లిలోని ట్రక్ పార్కింగ్ భూముల వేలాన్ని కూడా నేడు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భూముల వేలం ప్రారంభమైంది. భూముల ధరలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ నియోపోలిస్ భూములకు బిడ్లు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

