కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు (ACB Raids) నిర్వహించారు. 15 వేల లంచం తీసుకుంటూ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రాజేష్ రెడ్డి, ఆయన అసిస్టెంట్ శివారెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో గతేడాది చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్కు ఇటీవల 5 లక్షల బిల్లు మంజూరైంది.
ఈ బిల్లును క్లియర్ చేసేందుకు ఇంజనీరింగ్ ఏఈ రాజేష్ రెడ్డి సదరు కాంట్రాక్టర్ను రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేల నగదు తీసుకుంటుండగా ఏఈ రాజేష్ రెడ్డితో పాటు అసిస్టెంట్ శివారెడ్డిని రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయ సిబ్బందిలో ఒక్కసారిగా కలకలం రేగింది.

