ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: టీఎంయూ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో వద్ద తెలంగాణ మజ్దూర్ యూనియన్(TMU) 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపో అధ్యక్షుడు హన్మంతు, కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎంయూ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగుల సంక్షేమం కోసం యూనియన్ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కార్యదర్శి గంగాధర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పోశెట్టి, రాజేశ్వర్, జహీర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>