అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. సీసీ కెమెరాల్లో రికార్డ్

కలం, వరంగల్: వరంగల్ (Warangal) నగరంలోని విశ్వకర్మ వీధిలో శివనగర్‌ ఏసీ రెడ్డి నగర్‌కు చెందిన విక్రమ్ రెడ్డి (Vikram Reddy) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతడి స్నేహితుడే హత్య చేసి ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డవడం కేసులో కీలకంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>