epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టాస్క్.. నెగ్గుతారా..?

కలం, వెబ్ డెస్క్ : బీజేపీ తెలంగాణ చీఫ్‌ రాం చందర్ రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు గట్టి టాస్క్ ఎదురు కాబోతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు ఉప ఎన్నికల్లో, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ వీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. గ్రామాల్లో తమకు పట్టులేదని ముందే ప్రకటించారు. కానీ అర్బన్ లో బీజేపీకి (BJP) బలమైన పట్టుందని ఎప్పుడూ చెబుతుంటారు కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వారి సత్తా ఏంటో తేల్చుకునే టైమ్ వచ్చింది. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బాగానే సీట్లు సాధించింది. ఇప్పుడు గడువు తీరిన 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పార్టీ పెద్ద టాస్క్ ఇస్తోంది.

ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్‌, పాయల్ శంకర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పవార్ ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలు తీసుకుంటున్నారు. అటు ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, కాటిపల్లి వెంకట రమణారెడ్డి నిజమాబాద్ అర్బన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బండి సంజయ్ కు సవాల్ గా మారాయి. , ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, డీకే అరుణతో పాటు మిగతా ఎంపీలు కూడా తమ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో బలం చూపించుకోవాలని అనుకుంటున్నారు.

సొంత నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇమేజ్ డ్యామేజ్ తప్పదు. అందుకే వీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తమ పట్టును నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. అలాగే పార్టీ తెలంగాణ చీఫ్ రాం చందర్ రావుకు కూడా ఇదో పెద్ద సవాల్ గా మారింది. ఆయన హయాంలో జరిగిన ఉప ఎన్నికల్లో అంతంత మాత్రంగానే పార్టీ పోటీ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీకి (BJP) పట్టున్న అర్బన్ ఎన్నికల్లో గనక సత్తా చాటకపోతే ఆయన నాయకత్వం మీదనే పార్టీలో చర్చ జరిగే ఛాన్స్ లేకపోలేదు. అందుకే ఈ ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాం చందర్ రావుకు కీలకం అయ్యాయి. పురపోరులో మెజార్టీ సీట్లు గెలిస్తేనే ఆ ఎఫెక్ట్ రాబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలే కీలకం అవుతాయి. ఒకవేళ సొంత నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు బీజేపీ నేతలు గెలవలేకపోతే.. పట్టుచేజారిపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బీజేపీ ఈ సారి సత్తా చాటుతుందా లేదా చూడాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>