ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో సరుకు మాయం.. డెలివరీ బాయ్ చేతివాటం!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ సూరారం పరిధిలోని లక్ష్మీనగర్ ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో నిర్వహించిన అంతర్గత తనిఖీలో భారీ చోరీ (Flipkart theft) వ్యవహారం బయటపడింది. డెలివరీల పేరుతో సరుకులు బయటకు తీసుకెళ్లి సొంతానికి వాడుకున్నట్లు నిర్వాహకులు గుర్తించారు.

బీహార్‌కు చెందిన డెలివరీ ఉద్యోగి మహమ్మద్ జియావుల్ డెలివరీ చేయాల్సిన వస్తువులను దారి మళ్లించి సొంతానికి వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, వాచ్, దుస్తులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్ హబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్, బాలసూర్య, సంజయ్ అనే మరో ముగ్గురి పాత్రపై దర్యాప్తు చేపట్టారు. సంస్థ ఆస్తులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>