ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ మ‌రో అవినీతి అధికారి!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏసీబీ దాడుల్లో అవినీతి, లంచం కేసుల్లో త‌ర‌చూ అధికారులు చిక్కుకుంటున్నా కొంద‌రి తీరు మాత్రం మార‌డం లేదు. తాజాగా జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో మ‌రో అధికారి లంచం తీసుకొని ఏసీబీ (ACB) అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. గద్వాల సబ్‌ డివిజన్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అన్నారపు రమేష్‌బాబు (Annaarapu Ramesh Babu)ను గురువారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కాంట్రాక్టర్‌కు సంబంధించిన రూ.12 ల‌క్ష‌ల విలువైన పనుల బిల్లును మంజూరు చేసి ప్రాసెస్ చేసేందుకు ర‌మేష్ బాబు రూ.60 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులు విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు దాడులు చేప‌ట్టి ఆయనను పట్టుకున్నారు.

ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో తన కారులో నగదు పెట్టాలని కాంట్రాక్టర్‌కు ర‌మేష్ బాబు సూచించారు. ర‌మేష్ చెప్పిన విధంగానే బాధితుడు చేశాడు. అనంతరం ఏసీబీ అధికారులు రూ.60 వేల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడు రమేష్‌బాబును అరెస్ట్ చేసి, నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>