మ‌ద్దిమ‌డుగు హ‌నుమాన్ ఆల‌యంలో సీఎం పూజ‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: ప‌లు అభివృద్ది ప‌నుల శంకుస్థాప‌న‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌ద్దిమ‌డుగులో ప్ర‌సిద్ధ హ‌నుమాన్ ఆల‌యానికి వ‌చ్చారు. ఆల‌య అర్చ‌కులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. రూ.20 కోట్ల‌తో సీఎం పెబ్బ‌తి ఆంజ‌నేయ‌స్వామి ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాన‌ చేశారు. అలాగే మద్దిమడుగులో గిరిజనులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.

దీంతో పాటు రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణానికి, రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం ప‌ర్య‌టన సంద‌ర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా సీఎం నేడు రూ.450 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. అనంత‌రం అచ్చంపేట‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్నారు.

Also Read : నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం వార్నింగ్.. ఎందుకంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>